ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో అనేక క్రేజీ సినిమాలు థియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. ఆ మూవీ లు ఏవో ... అవి ఏ తేదీల్లో విడుదల కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

అనిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 1 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

కెప్టెన్ మిల్లర్ : ధనుష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొంత కాలం క్రితమే ప్రకటించారు. ఈ మూవీ లో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

హాయ్ నాన్న : నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు.

సైన్ధవ్ : విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు.

హరోం హర : సుధీర్ బాబు హీరో గా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు.

దుంకి : ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ : నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు.

గ్యాంగ్ ఆఫ్ గోదావరి : విశ్వక్ సేన్ హీరో గా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ సినిమాలలో చాలా సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: