‘ఆప్తమిత్ర’ పేరుతో కన్నడంలో విడుదలైన ఈసినిమా సూపర్ హిట్ కావడంతో ఈమూవీని తమిళంలో తీసి తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఈ రెండు భాషలలోనూ ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఆతరువాత ‘ఆప్తమిత్ర 2’ వచ్చింది. ఈమూవీకి కూడ పి. వయసు దర్శకత్వం వహించాడు. అయితే ఈసినిమాలో నటించిన హీరో విష్ణు వర్ధన్ ఎలాంటి అనారోగ్యం లేకుండా మరణించడంతో ఈమూవీ రీమేక్ లో నటించడానికి రజనీకాంత్ భయపడ్డాడు అని అంటారు.
ఆతరువాత వెంకటేష్ ఈమూవీ రీమేక్ లో నటిస్తున్నప్పుడు వెంకటేష్ ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలు రాకూడదని అప్పట్లో పూజలు జరిగాయి అన్న గాసిప్పులు ఉన్నాయి. అయితే ఈసినిమా ఫ్లాప్ అయింది. ‘చంద్రముఖి’ మ్యానియాను పసిగట్టిన బాలీవుడ్ నిర్మాతలు ఈమూవీని ‘భూల్ భులయ్యా’ పేరుతో తీసినప్పటికీ ఆసినిమాకు పెద్దగా స్పందన రాలేదు.
ఇప్పుడు ‘చంద్రముఖి’ మ్యానియాను నమ్ముకుని హారర్ సినిమాలను తెలివిగా తీసే రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి -2’ సిద్ధం చేస్తున్నారు. ఈసినిమా ‘చంద్రముఖి’ మూవీకి రియల్ సీక్వెల్ అని అంటున్నారు. కంగనా రనౌత్ చంద్రముఖి గా నటిస్తున్న ఈ సీక్వెల్ లో ఆమె నట విశ్వరూపం కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. ‘వినాయకచవితి’ పండుగను టార్గెట్ చేస్తూ తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈమూవీతో తరిగి దక్షిణాదిలో కంగనా హవా మొదలయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం లారెన్స్ ఫ్లాప్ ల పర్వంలో కొనసాగుతున్నాడు. అతడికి ఒక మంచి హిట్ కావాలి. ‘చంద్రముఖి’ కేవలం రజనీకాంత్ కు తప్ప మారెవ్వరికీ కలిసి రాలేదు. మరి లారెన్స్ కు ఎలామి హిట్ వస్తుందో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి