ప్రాచీ ఠాకూర్ మాట్లాడుతూ.. పటాస్ సినిమా తర్వాత ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు నన్ను సంప్రదించి ఒక యాడ్ చేయమని అడిగారు. నేను ఓకే చెప్పాను. నాకు భాష రాకపోవడం తో ఓ తెలుగు అబ్బాయిని మీడియేటర్ గా పెట్టుకున్నాను. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే షూట్ కి ముందు కమిట్మెంట్ కి నువ్వు రెడీనే కదా అని అడిగాడు. నువ్వు డేట్ చెప్పు, నేను కచ్చితం గా షూట్ కి వస్తాను అన్నాను. అతను మళ్ళీ మళ్ళీ కమిట్మెంట్ అని అడిగాడు. అర్ధం అవ్వలేదు అంటే ఇంకో రెండు లక్షలు ఇస్తారు కాంప్రమైజ్ అవుతావా అని అడిగాడు. నేను ఆ డీటెయిల్స్ అన్ని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కి చెప్తే అప్పుడు తను కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పింది. అది అర్థమయ్యాక నేను చాలా బాధపడ్డాను. ఆ యాడ్ కూడా చేయను అని చెప్పి అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాను అని తెలిపింది ప్రాచీ ఠాకూర్. దీంతో గుజరాతీ భామ ప్రాచీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి