నట సింహం నందమూరి బాలకృష్ణ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి మరియు హరీష్ పెద్ద ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ఇది. అయితే దసరాకు ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించే షెడ్యూల్ ప్రకారంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను అన్నిటిని కూడా పూర్తి చేశారు చిత్రబంధం. మిగిలిన పార్టును కూడా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రామ్ పాల్ భగవంత్ కేసరి సినిమాలో తన షూటింగ్ పార్ట్ ని తాజాగా పూర్తి చేసుకున్నారు.

బాలీవుడ్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈయన ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి ఎంతో మందిని ఆయన అభిమానులను చేసుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే సౌత్ సినిమాలపై ఆసక్తి చూపుతు సౌత్ సినిమాల్లో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఇక తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కావాలని ప్రయత్నిస్తున్నారు. భగవంత్ కేసరి సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఆయన నటించబోతున్నారు. ఇక భగవంత్ కే సరి సినిమాలో ఆయన పాత్ర పేరు రాహుల్  అని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది.

ఇక ఈ సినిమాలో ఆయన విలన్ గా కనిపించబోతున్నారుట. అంతేకాదు ఆయన పాత్ర చాలా భయంకరంగా ఉంటుందని ప్రేక్షకులు ఖచ్చితంగా తన పాత్రని మెచ్చుకుంటారని అంటున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారంతోపాటు అర్జున్ రామ్ పాల్ మరియు బాలకృష్ణ అనిల్ రావిపూడి కలిసి ఉన్న ఒక ఫోటోని చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ సినిమా దసరా కానుకగా విడుదల కాబోతుంది. అక్టోబర్ 19న గ్రాండ్గా ఈ సినిమా రాబోతుంది. కాగా ఇందులో కాజల్ అగర్వాల్ మరియు శ్రీ లీల హీరోయిన్లుగా కనిపించబోతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: