అయితే అక్షయ్ కుమార్ గత కొంతకాలం నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ లతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న ఎందుకో అవి ప్రేక్షకాదరనకు నోచుకోలేకపోతున్నాయి. అయితే ఇటీవలే మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ మై గాడ్ 2 చిత్రం ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా. కానీ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులకు నచ్చింది. దీంతో ఇక వసూళ్లు కూడా భారీగానే వస్తున్నాయి అని చెప్పాలి.
అయితే ఈ సినిమా లో అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్ విషయంలో గత కొంతకాలం నుంచి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 చిత్రానికి భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాత అజిత్ స్పందిస్తూ అదంతా అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ కోసం అక్షయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు అంటూ చెప్పారు. అయితే సినిమా ముందుకు వెళ్లడానికి అక్షయ్ అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఇక ఇలాంటి సాహసోపతమైన సినిమాలు తీయడంలో అక్షయ్ ఎప్పుడు ముందుంటారని తెలిపిన నిర్మాత.. లాభాల్లో అక్షయ్ కి షేర్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటివరకు 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. విమర్శలను దాటుకుంటూ ఇంకా థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి