పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసింద.. ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలు అంటూ మరింత బిజీగా మారిన ఇటీవల నటించిన చిత్రం బ్రో. తమిళ్ మూవీ వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈ సినిమా అయిపోతే తెలుగులో సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు జూలై 28వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఈ రోజున పవన్ బర్తడే సందర్భంగా ఎప్పటినుంచో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి డైరెక్టర్ క్రిష్ అదిరిపోయే అప్డేట్ ను తెలియజేశారు.


మొదటి సారి పీరియాడికల్ యాక్షన్ రామగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది. నిన్నటి రోజున అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ సినిమా అప్డేట్ సైతం రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ ఫోటోలలో పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. నిండుగా గడ్డం హెయిర్ స్టైల్ ఎరుపు నలుపు రంగులు కలిగిన ఒక ప్రత్యేకమైన దుస్తులలో సైతం పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉన్నారు.. కుడి చేతికి కడియం ఎడమ చేతికి నల్ల దారం చాలా మాస్ లుక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ని ఉగ్రరూపం లో కనిపిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.


అయితే ఈ పోస్టర్ చూస్తూ ఉంటే యాక్షన్ సీన్స్ కు సిద్ధంగానే ఉన్నట్లుగా కనిపి స్తోంది. పవన్ కళ్యాణ్ మల్టిపుల్ లుక్సులు అందరిని అదరగొట్టేస్తున్నారని చెప్పవచ్చు ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: