తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత మూడు రోజుల క్రితం స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై చాలామంది స్పందిస్తారని అందరూ అనుకోగా.. ఇప్పటివరకు అటు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు, చంద్రబాబు సన్నిహితులు ఎవరు కూడా స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సంగతి పక్కన పెడితే..కనీసం మిగతా వారైనా నోరు మెదపాలి. కానీ ఎవరూ కూడా స్పందించలేదు. నిజం బయటపెట్టే వాడికే సమాజం తలవంచుతుంది అని నేడు మన సినీ ప్రముఖులు కూడా రుజువు చేస్తున్నారు.

ఎందుకంటే ఏపీలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పడం కష్టంగా మారింది.. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో గెలుస్తాడా అన్న గ్యారెంటీ కూడా లేదు.. మరొకవైపు మళ్ళీ జగన్ గెలిస్తే.. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై స్పందించిన వారి పరిస్థితి అప్పుడు ఎలా ఉండబోతోంది అనే సందేహం కూడా మొదలయ్యింది. అంతేకాదు ఒకసారి జగన్ పగబట్టారంటే ఏపీ బాక్స్ ఆఫీస్ దగ్గర తమకు పుట్టగతులు ఉండవు అని రీల్ హీరోలుగా చలామని అవుతున్న స్టార్స్ అందరూ కూడా ఇదే  వైఖరిని అనుసరిస్తున్నారు. ఒకప్పుడు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన సినీ ప్రముఖులు కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అని అభిమానులే కాదు చంద్రబాబు,  నందమూరి కుటుంబ సభ్యులే కూడా ఈ విషయంపై నోరు మెదపడం లేదు. వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్నో ఫంక్షన్లు జరిగినా వాటన్నింటికీ పిలిచినా.. పిలవకపోయినా జూనియర్ ఎన్టీఆర్ వెళ్తున్నాడు. అయితే కనీసం మీడియా ముందు అయినా బాలకృష్ణ , చంద్రబాబు లాంటి వారు ఎన్టీఆర్ ని పలకరించి ఉంటే నేడు జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చేవాడు కనీసం మనిషి లాగా కూడా చూడని వ్యక్తుల కోసం తాను ఎందుకు కష్టాలు కొని తెచ్చుకోవాలి అని ఆయన ఆలోచించారో ఏమో..

మరోవైపు 2014లో అధికారంలోకి వచ్చాక ఇదే జూనియర్ ఎన్టీఆర్ కి  కనీసం ఆహ్వానం కూడా లభించలేదు. సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా పిలిచి ఎక్కడో స్టేజ్ కింద 20 వ వరుసలో కూర్చోబెట్టారు. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు మరెన్నో విషయాలలో చంద్రబాబు, బాలకృష్ణ ఎన్టీఆర్ కి అన్యాయం చేశారు . అందుకే నేడు ఆయన పట్టించుకోవడం లేదనే వార్త స్పష్టంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: