మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వాల్టేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , బాబి సింహ విలన్ పాత్రల్లో నటించగా ... మాస్ మహారాజా రవితేజమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. రవితేజ కు భార్య పాత్రలో ఈ మూవీ లో క్యాథరిన్ నటించింది.

ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సినిమాటో గ్రాఫర్ లలో ఒకరు అయినటువంటి చోటా కె నాయుడు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన వాల్టేరు వీరయ్య మూవీ గురించి ... ఆ సినిమా కోసం చిరంజీవి కష్టపడిన విధానం గురించి చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా చోటా కె నాయుడు మాట్లాడుతూ ... వాల్తేరు వీరయ్య సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంది. అప్పటి వరకు సినిమా షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. దానితో చిరంజీవి గారు రోజుకు 18 గంటల పాటు కష్టపడ్డాడు.

ఈ సినిమాకి ఆ సమయంలో రెండు యూనిట్లు పని చేశాయి. చిరంజీవి గారు ఉదయం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక పాట కోసం పని చేశాడు. భోజనం చేసిన వెంటనే ఆపై శంషాబాద్ లో బోట్ ఎపిసోడ్ షూటింగ్ వెళ్లి రాత్రి 11 గంటల వరకు అందులో పాల్గొనేవారు. ఇలా ఆయన ఆ సినిమా విడుదల సరైన సమయంలో విడుదల కావడం కోసం రోజుకు 18 గంటల పాటు షూటింగ్ లో పాల్గొన్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: