తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న హీరోలలో రామ్ ఒకరు. ఈయన ఆఖరుగా తమిళ దర్శకుడు లింగు సామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ భాషలో కూడా విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది. ఇకపోతే ది వారియర్ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తర్వాత రామ్ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా ... శ్రీకాంత్ , ప్రిన్స్మూవీ లో కీలక పాత్రలలో నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ లో హీరోగా నటించిన రామ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన ఈ మూవీ కి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా రామ్ మాట్లాడుతూ ... ఈ మూవీ.లో నా ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ఈ ఒక్క సీన్ కోసమే 27 జనరేటర్ లను వాడి లైటింగ్ ను పెట్టారు. ఆ లైటింగ్ లో ఆ సీన్ ను అద్భుతమైన రీతిలో దర్శకుడు తెరకెక్కించాడు.  ఆ సన్నివేశం మీ అందరిని సూపర్ సాటిస్ఫై చేస్తోంది అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: