
అయితే ఆ గాసిప్పులకు చెక్ పెట్టె విధంగా సాయి పల్లవి తాను తీసుకునే నిర్ణయాలలో వేగం పెంచింది. ప్రస్తుతం తమిళ హీరో శివ కార్తీకేయన్ తో ఒక మవవీని చేస్తున్న ఈమె త్వరలో నాగచైతన్య తో గీత ఆర్ట్స్ నిర్మించబోతున్న మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటించడానికి తన అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ మూవీ తరువాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతోంది.
పరిస్థితులు ఇలా ఉండగా సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ సంచలనంగా మారబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ వారాసుడుతో ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ వచ్చే సంవత్సరం మొదలు పెట్టబోతున్న ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కథ ఆమెకు నచ్చడంతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఖరార్ అయింది అని అంటున్నారు.
వాస్తవానికి అమీర్ ఖాన్ కొడుకు ఇంకా హీరోగా సెటిల్ కాలేదు. అయినప్పటికీ ఆమె రిస్క్ చేసి తన మొదటి బాలీవుడ్ మూవీని అమీర్ ఖాన్ కొడుకుతో నటిస్తూ ఉండటం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. దక్షిణాది సినిమా రంగానికి చెందిన ఎందరో దర్శక నిర్మాతలు సాయి పల్లవిని తమ ప్రాజెక్ట్ లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆమె ఆ ప్రాజెక్ట్స్ ను పక్కకు పెట్టి ఇప్పుడు అమీర్ ఖాన్ కొడుకు బాధ్యతను తీసుకున్నట్లుగా వార్తలు రావడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..