మోస్ట్ బ్యూటిఫుల్ నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తమిళ సినిమాల ద్వారా వెండి తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు లో కూడా వరుసగా సినిమాల్లో నటించింది. కాకపోతే ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దానితో ఈ నటికి ఐరన్ లెగ్ అని ఇండస్ట్రీ లో పేరు కూడా వచ్చింది. ఇక అలాంటి సమయం లోనే ఈనటి పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ లో హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 

ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్న ఈ నటి అందులో భాగంగా ఎక్కువ సినిమాలతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత ఇండస్ట్రీ లో గోల్డెన్ లెగ్ గా ఈ నటి పేరును తెచ్చుకుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి ... చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాల్లో హీరోయిన్ గా నటించి రెండు మూవీ లతో కూడా మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే సినిమాలతో ఎంత బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటిఫుల్ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కాలర్ పలుచటి శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించి దానిపై బ్లాక్ కలర్ లో ఉన్న షర్ట్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: