టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే కాకుండా డిఫరెంట్ సినిమాలు చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. రిజల్ట్ ఎలా ఉంది అని కాకుండా నచ్చిన సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళ దర్శకులతో సైతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో.  ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'ఊరు పేరు భైరవకోన' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఇదే బ్యానర్ లో ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సైన్ చేశారు ఈ యంగ్ హీరో. గతంలో వచ్చిన 'మాయామన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో సందీప్ కిషన్

దర్శకుడు సివి కుమార్ ఈ చిత్రం కోసం మరోసారి కలిసి పని చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 26 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభమైంది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో రామ బ్రహ్మం సుంకర భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాయావన్ వరల్డ్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం గతంలో వచ్చిన 'మాయావన్' కి సీక్వెల్ గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. టాప్ ప్రొడక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఒక సామాన్యుడి ఘర్షణ కథగా ఉండబోతోంది. సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. 

ఈ క్రమంలోనే ముహూర్తపు షాట్ కి దామోదర ప్రసాద్ క్లాప్ కొట్టగా, వెంకట్ బోయినపల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షార్ట్ కి జెమినీ కిరణ్ దర్శకత్వం వహించారు. నవంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. కార్తిక్ కే. తిల్లై ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, నాని దసరా సినిమాకి అదిరిపోయే ఆల్బమ్ అందించి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సంతోష్ నారాయణన్ ప్రభాస్ పాన్ వరల్డ్ ఫిలిం 'కల్కి 2898AD' కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: