
ఆలస్యం అయితే అయ్యింది కానీ అసలు సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ పలు రకాల సందేహాలను సైతం అభిమానులలో ఎక్కువగా తలెత్తుతున్నాయి. కానీ అభిమానులు మాత్రం దిల్ రాజు ఎక్కడ కనిపించినా సరే కచ్చితంగా ఈ విషయాన్ని మెగా ఫాన్స్ అడుగుతున్నారు. ఒకవేళ షూటింగ్ ఆలస్యంగా జరిగితే బడ్జెట్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఆర్టిస్టుల డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి.
రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారని అనుకునే లోపు రామ్ చరణ్ కు ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది. దీంతో మళ్లీ ఒక వారం రోజులపాటు బ్రేక్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మళ్ళీ శంకర్ ఇండియన్-2 సినిమా పైన ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఇలా రెండు సినిమాలను ఒకేసారి తీయడంతో శంకర్ కు పని భారం మరింత పెరిగిపోతోంది. దీంతో గేమ్ చేంజెర్ సినిమా పనులు కూడా మరింత ఆలస్యం అయ్యేవిధంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో అయినా ఈ సినిమా విడుదల చేస్తారు అనుకుంటే అప్పటికి కూడా విడుదల అయ్యే అవకాశం కనిపించలేదని ఇండస్ట్రీ వర్గాలనుంచి వార్తలు వినిపిస్తున్నాయి.