టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గ్లోబల్ స్టార్స్ గా, పాన్ ఇండియా హీరోలుగా చలామణి అవుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ఒకరి తరువాత ఒకరు వరుస సినిమాలను ప్రకటిస్తూ అభిమానులకు మరింత ఊరట కలిగిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరి సినిమాలు కూడా విడుదలకు సిద్ధం కాబోతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మెగా హీరోలు తమ సినిమాలకు ఒక వారం పాటు బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కి వారం రోజులపాటు రామ్ చరణ్ బ్రేక్ ఇవ్వనున్నారు . మరొకవైపు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతూ ఉండగా ఈ సినిమా షూటింగ్ కూడా వారం రోజులపాటు వాయిదా పడబోతోంది.  మరొకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన వారాహి యాత్రను అలాగే తన తదుపరి సినిమాని కూడా వారం రోజులపాటు పోస్ట్ పోన్ చేయనున్నారట.

అయితే ఎందుకు ఇలా వారం రోజులపాటు బ్రేక్ ఇవ్వనున్నారు అనే విషయానికి వస్తే.. త్వరలో నాగబాబు తనయుడు ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్,  లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో  జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ వివాహ వేడుక నిమిత్తం ఈ స్టార్ హీరోలు అందరూ కూడా వారం రోజులపాటు తమ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. మొత్తానికైతే లావణ్య త్రిపాఠి , వరుణ్ తేజ్ జూన్లో ఎంగేజ్మెంట్ జరుపుకొని ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలో ఈ ఏడాది వరుస శుభకార్యాలు జరుగుతూ అభిమానులకు సందడి వాతావరణాన్ని కలగజేస్తున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: