పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడుగా పరిచయమయ్యాడు తరుణ్ భాస్కర్.  మొదటి సినిమాతోనే డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు.  చాలా తక్కువ  బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాని తన రైటింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. యూత్ ని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది  రీసెంట్ గా రీరిలీజ్ అయి భారీ వసూళ్లను రాబట్టింది. ఈ రెండు సినిమాలు కూడా అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చినవే. ఇప్పుడు మళ్లీ అదే ప్రొడక్షన్ సంస్థ నుండి తరుణ్ భాస్కర్ కి నిర్మాత సురేష్ బాబు మరో అవకాశం ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ తో ఆ మధ్య ఓ సినిమా చేయాలని తరుణ్ భాస్కర్ అనుకున్నారు. కథ కూడా ఓకే అయింది. చర్చల్లో ఉందని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారని వార్తలు వచ్చిన కొంతకాలానికి ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అందరూ దాన్ని మర్చిపోయారు. తరుణ్ భాస్కర్ కూడా డైరెక్టర్ గా కాకుండా నటుడిగా బిజీ కావడం, మరోవైపు వెంకటేష్ ఇతర ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రాజెక్టుపై ఎవరు స్పందించింది లేదు. ఇదిలా ఉంటే దగ్గుపాటి హీరో రానా సపోర్ట్ తో మళ్ళీ తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'(Keeda Kola) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.

 ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకుడు తరుణ్ భాస్కర్ కి వెంకటేష్ ప్రాజెక్ట్ కు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి తరుణ్ భాస్కర్ బదిలిస్తూ.." నిజానికి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కథ సెట్ అయినప్పటికీ చివర్లో క్లైమాక్స్ మాత్రం అనుకున్నట్లు పేపర్ పైకి రాలేదు. నేను ఎప్పుడూ కూడా అక్కడే తడబడుతూ ఉంటాను. పర్ఫెక్ట్ క్లైమాక్స్, పర్ఫెక్ట్ సబ్జెక్టుతోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. ఏదో ఒకటి కానిచ్చేద్దాం అనుకుంటే మళ్లీ నన్నే తిడతారు. ఇతనికి పెద్ద హీరోల సినిమాలు హ్యాండిల్ చేయడం సరిగ్గా రాదు అనే రిమార్కులు నాకొద్దు. అందుకే టైం తీసుకున్నా కూడా మంచి సబ్జెక్టు ఇవ్వాలని అనుకుంటున్నాను" అని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: