రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు ఈ సినిమా మీద ఇండియా వైజ్ గా మంచి క్రేజ్ ఏర్పడింది.. ఈ సినిమాకి రవితేజ సొంతంగా ఐదు భాషలలో డబ్బింగ్ చెప్పడం జరిగిందట. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకి రావడం జరిగింది. అయితే ఈ సినిమా ఆల్రెడీ విడుదలైన కొన్నిచోట్ల ట్విట్టర్లో పాజిటివ్ రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తోంది. మరి ప్రేక్షకుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం.



హీరో రవితేజ పాన్ ఇండియా తో మొదటిసారి టైగర్ నాగేశ్వర సినిమాతో తన హవా చూపించారు.. ఇందులో బాలీవుడ్ హీరోయిన్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు.. కీలకమైన పాత్రలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ నటించారు. ఈ సినిమా స్టువర్టపురం గజదొంగ గా పేరు పొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది.




సినిమా చూసిన ఒక నెటిజన్ ఒక రేంజ్ సినిమా భయ్యా కేక అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ అదిరిపోయింది అని.. రవితేజ మాస్ ఎంట్రీ కూడా స్క్రీన్ ప్రజెంటేషన్ ఇంటర్వెల్ కార్డు బ్లాక్ బాస్టర్ ఫస్ట్ అఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను కచ్చితంగా చూడాలని తెలియజేస్తున్నారు.

మరికంత మంది స్టోరీస్ స్క్రీన్ ప్లే అదిరిపోయిందని బిజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని కొన్నిసార్లు సైలెంట్ గా అనిపించినా కానీ రవితేజ కెరియర్ లోనే బెస్ట్ పెర్ఫార్మషన్స్ అంటూ తెలుపుతున్నారు. ఫైట్ సన్నివేశాలు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సాంగ్స్ తప్ప అన్ని బాగున్నాయనే తెలుపుతున్నారు.

VFX పక్కనపడితే ఫస్ట్ అఫ్ అదిరిపోయిందని ఇంటర్వెల్ సన్నివేశం చాలా హైలెట్ గా ఉందని.. రవితేజ చాలా కొత్తగా ట్రై చేశారంటూ విచ్చేస్తున్నారు. ఇలా మొత్తానికి రవితేజ టైగర్ నాగేశ్వరరావు తో పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: