తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి కార్తీ ఆఖరుగా సర్దార్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన కార్తీ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇకపోతే ఈ సినిమా తెలుగు లో కూడా సర్దార్ అనే టైటిల్ తో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇకపోతే సర్దార్ లాంటి సూపర్ సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత కార్తీ "జపాన్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ ని ఈ సంవత్సరం దీపావళి పండగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ బృందం ఈ సినిమా తెలుగు వర్షన్ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ సినిమా తెలుగు వర్షన్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ మూవీ యొక్క తెలుగు టీజర్ కు 6.4 మిలియన్ వ్యూస్ , 107 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రాజు మురుగన్ దర్శకత్వం వహించగా ... అను ఇమాన్యుయల్ ఈ మూవీ లో కార్తీ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.  డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ తో కార్తీ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: