ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అనేక సినిమాలు "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇకపోతే ప్రేక్షకులు చాలా రోజుల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూడు క్రేజీ మూవీ లు కూడా ఈ వారం "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏవి ..? ప్రస్తుతం అవి ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

స్కంద : రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్ ఓ కీలకమైన పాత్రలో నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా నిన్నటి నుండి అనగా నవంబర్ 2 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

జవాన్ :  బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకొని వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ లను రాబట్టింది. ప్రియమణి కీలకమైన పాత్రలో నటించిన ఈ మూవీ లో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ నిన్నటి నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో హిందీ , తెలుగు , తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

మ్యాడ్ : ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ ఈ రోజు నుండి అనగా నవంబర్ 3 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇకపోతే ఈ మూడు మూవీ ల "ఓ టి టి" విడుదల గురించి చాలా మంది ప్రేక్షకులు చాలా రోజుల నుండి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ott