అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఒక యూట్యూబర్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మందు పార్టీ చేసుకుని వారిలో వారికి గొడవలు మొదలై నిప్పు పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పలు రకాల వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే అక్కడే ఉన్న యూట్యూబర్ తగలబడి పోతున్న బోట్లను తన సెల్ఫోన్లో చిత్రీకరించి యూట్యూబ్లో కూడా ఉంచడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో పోలీసులు వెంటనే ఆ యూట్యూబ్ వారితో పాటు మరి కొంతమందిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
దాదాపుగా 36 మంది మత్స్యకారుల బోట్లు సైతం పూర్తిగా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో కొన్ని కోట్ల రూపాయలు నష్టాన్ని వాటిల్లుతోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. దాదాపుగా బోట్లు కోల్పోయిన 60 మందికి సైతం పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి 50,000 చొప్పున అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరో రెండు రోజులలో వారి యొక్క కుటుంబాలను కూడా కలుసుకొని ఈ చెక్కులను సైతం అందజేయబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి