సందీప్ వంగ సినిమా అంటే యూత్ ఆడియన్స్ అంతా కూడా ఎగ్జైటెడ్ అయ్యేలా చేశాడు. అర్జున్ రెడ్డి సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన సందీప్ వంగ అదే సినిమా హిందీలో కబీర్ సింగ్ అని తీసి అక్కడ డ్యాషింగ్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. తండ్రి కొడుకుల మధ్య కథతో ఈ సినిమా వస్తుంది. సినిమా ట్రైలర్ తోనే మెంటల్ ఎక్కించేశాడు సందీప్ వంగ. ఈ సినిమాతో రణ్ బీర్ కపూర్ రేంజ్ మారబోతుందని చెప్పొచ్చు. ట్రైలర్ మాత్రం సందీప్ రచ్చ చేశాడని అంటున్నారు ఆడియన్స్.

యానిమల్ ట్రైలర్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ చూసి సినిమా ఓటీటీ రైట్స్ కోసం కూడా భారీ పోటీ ఏర్పడిందట. అయితే ఈ సినిమాను ఫైనల్ గా సోనీ లివ్ వారు ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఫ్యాన్సీ రేటుకి యానిమల్ ఓటీటీ రైట్స్ కొనుగోలు చేశారట సోనీ లివ్ వారు. రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అంచనాలను మించేలా ఉంటుందని ఆడియన్స్ నమ్ముతున్నారు.

సందీప్ వంగ డైరెక్షన్ లో సినిమా అంటే ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయో వాటికి ఏమాత్రం తగ్గని విధంగా యానిమల్ ఉంది. ట్రైలర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించిన సందీప్ వంగ ఈ సినిమాతో మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో చూపించనున్నాడు. సందీప్ వంగ తన తర్వాత సినిమా ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా లాక్ చేశాడు. ఆ సినిమా కూడా వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: