లేడి సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వుంది.రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సరసన 'జవాన్' సినిమా లో నటించి బ్లాక్ బస్టర్‌ హిట్ అందుకుంది  ఈ భామ.అలాగే విశ్వ నటుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబో లో వస్తున్న సినిమా లో కూడా నటిస్తుంది.తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార మరో కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. నీలేష్ కృష్ణ  అనే కొత్త దర్శకుడితో నయనతార చేస్తున్న కొత్త చిత్రం 'అన్నపూర్ణి'.. ఈ సినిమా నయన్ కెరీర్‌లో 75 వ సినిమా గా తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నయనతార ఒక ప్రొఫెషనల్ చెఫ్‌ అవ్వాలను కుంటుంది.ఈ క్రమంలో తనకు ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి. కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిడిని  తట్టుకుని దేశంలో బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా కథ..అయితే తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంది.ఏ దేవుడు కూడా మాంసం తినడం పాపం అని చెప్పలేదు అంటూ వచ్చే డైలాగ్ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది.ఇక మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్ మరియు సురేష్ చక్రవర్తి వంటి పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: