రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ డిసెంబర్ 1న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం 'యానిమల్' ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది.   సినిమాలో రష్మిక మరింత గ్లామర్ గా కనిపించబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక ప్రమోషన్స్ లోనూ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. 

ఈ ఫోటోల్లో రష్మిక మరోసారి తన గ్లామర్ తో అదరగొట్టేసింది. రష్మిక లేటెస్ట్ ఫోటోలను నెట్ ఫ్లెక్స్ రిలీజ్ చేస్తూ.." మా లక్ష్యం మజ్ను గా ఉండటమే.. రష్మిక మందన అది జరిగేలా చూసుకుంది" అంటూ పోస్ట్ లో పేర్కొంది. ఈ ఫోటోలో రష్మిక నియాన్ గ్రీన్ కలర్ సూట్ ధరించి హాట్ ఫోజులతో కుర్ర కారు మతులు పోగొట్టింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ రష్మిక గ్లామర్ కి ఫిదా అవుతూ..' గ్రీన్ సూట్ లో రష్మిక గ్లామర్ అదిరిపోయింది', 'ఈ ఫోటోల్లో రష్మిక చాలా హాట్ గా కనిపిస్తుంది', 'యానిమల్ బ్యూటీ టూ హాట్'.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో రష్మిక లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారాయి. 

ఇదిలా ఉంటే నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'మిషన్ మజ్ను' అనే సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక యానిమల్ విషయానికొస్తే, అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: