హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం పాటు వరుస అపజయలతో డిలా పడిపోయిన షారుక్ ఈ సంవత్సరం మొదటగా పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ఇకపోతే ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఇలా పఠాన్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న షారుక్ ఆ తర్వాత అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా సూపర్ టాక్ ను తెచ్చుకొని ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఈ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార ... షారుక్ కి జోడిగా నటించింది. ఇలా ఈ సంవత్సరం ఇప్పటికే పరుసగా రెండు విజయాలను అందుకున్న షారుక్ ఈ సంవత్సరం మూడవ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన డంకి అనే మూవీ తో షారుఖ్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మూవీ కి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంవహించగా ... తాప్సిమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ ట్రైలర్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ట్రైలర్ ను డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికార ప్రకటన మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: