మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా రవితేజ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన రవితేజ.. ఇటీవల కాలంలో  డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అవి పెద్దగా హిట్ అవ్వలేకపోయాయి. అయితే ప్రస్తుతం తన హిట్ కాంబో డైరెక్టర్ అయిన గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేయడానికి రవితేజ సిద్ధమయ్యాడు అని చెప్పాలి. గతంలో వీరి కాంబినేషన్లో బలుపు, క్రాక్ సినిమాలు వచ్చి ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించారో ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది.


 ఇక ఇప్పుడు మరోసారి రవితేజ గోపీచంద్ మలినేని కాంబో రిపీట్ అవుతూ ఉండడంతో.. ఇక ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు అటు బడ్జెట్ కష్టాలు వచ్చాయి అంటూ గత కొంతకాలం నుండి వార్తలు వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా రవితేజ గోపీచంద్ కాంబో మూవీ ఆగిపోయింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇదే కథను మరో హీరోతో చేయాలని అనుకుంటుందట. అయితే తెలుగులో కాదు హిందీలో సన్నీ డియల్ తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


 గద్దర్ 2 సినిమాతో సన్నీడియోల్ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా సూపర్ డూపర్ విజయం సాధించడంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు సన్నీ డియోల్. ఈ క్రమంలోనే ప్రస్తుతం అనుకున్న కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. ఈ బాలీవుడ్ హీరో తో సినిమా చేయాలని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సన్నీ డియోల్ కి కథ వినిపించడం కూడా చేశాడట డైరెక్టర్ గోపీచంద్. అయితే స్టోరీ లైన్ విన్న సన్నీ డియోల్ ఎగ్జైట్  అయిపోయి ఓకే చెప్పేసాడట. కాగా ప్రస్తుతం స్క్రిప్టులో పలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: