మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని కళ్యాణి ప్రియదర్శన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన హలో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి అంచనాలను థియేటర్ లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ప్రభావం చూపలేకపోయింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ మూవీ లోని తన నటనతో ఈ బ్యూటీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. 

దానితో ఆ తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి తెలుగులో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి శర్వానంద్ హీరోగా రూపొందిన రణరంగం .... సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందిన చిత్రలహరి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఇందులో రణరంగం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టగా ... చిత్రలహరి మూవీ మాత్రం మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే సినిమాల్లో ఎక్కువ శాతం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ శాతం క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కళ్యాణి అదిరిపోయే లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: