సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటులు వాళ్ళు కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతు ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లో రాజ్ తరుణ్ లాంటి సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ఏవి కూడా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు ఆయన నాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించాడు.అయితే ఆ క్యారెక్టర్ కూడా తనకు పెద్దగా ఉపయోగపడే విధంగా కనిపించడం లేదు. అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.నిజానికి ఇవాళ్ల రిలీజ్ అయిన నా సామిరంగ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో రాజ్ తరుణ్ చేసిన క్యారెక్టర్ కూడా అంత పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన సినిమా కెరియర్ మీద చాలామందికి చాలా రకాల డౌట్లయితే వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆయన సోలో హీరోగా కొనసాగుతాడా లేక స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉంటాడు అనేది కూడా ఇక్కడ పెద్ద డౌట్ గా మారింది. అయితే ఇప్పుడు ఆయన చేసిన ఈ పాత్ర మాత్రం తనకు ఏ రకంగా యూజ్ కాకపోవడంతో చాలా పెద్ద చిక్కుల్లో పడ్డట్టుగా తెలుస్తుంది. మరి రాజ్ తరుణ్ హీరోగా తన కెరియర్ ముగిసినట్టేనా ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయాల్సిందేనా అనే సందేహాలు కూడా వస్తున్నాయి.   ఇక ఇలాంటి క్రమంలో రాజ్ తరుణ్ ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ఎంచుకోవాలని చూస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి నా సామిరంగ సినిమాలో ఆయన పాత్ర చేయకపోయి ఉంటే బాగుండేది దానివల్ల పెద్దగా ఆయనకు ఒరిగిందయితే ఏమీ లేదు. ఇంకా దీని వల్ల ఆయన కి సోలో హీరోగా వచ్చే అవకాశాలు కూడా ఇక మీదట రాకుండా పోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: