దసరా’ సూపర్ సక్సస్ తో జోష్ లో ఉన్న నాని ఆమధ్య విడుదల అయిన ‘హాయ్ నాన్న’ మూవీ సక్సస్ ను బోనస్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు నాని దృష్టి అంతా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ మూవీ పై ఉంది. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీలో నాని చాల డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు.ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీకి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఈమూవీ ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ పై కన్ను వేసింది అని అంటున్నారు. ఈసంవత్సరంలో రాబోతున్న ఆగష్టు 15న ‘పుష్ప 2’ ను విడుదల చేద్దామని ఈమూవీ మేకర్స్ అదేవిధంగా సుకుమార్ చెపుతున్న విషయం తెలిసిందే. అయితే ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఈ మూవీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న నేపధ్యంలో ఈమూవీకి సంబంధించి చాల గ్రాఫిక్ వర్క్స్ తో ముడిపడి ఉంది అంటున్నారు.ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ‘పుష్ప 2’ గ్రాఫిక్ వర్క్స్ పనులు ఆనుకున్నంత వేగవంతంగా పూర్తి అవ్వడం లేదు అన్న లీకులు వస్తున్నాయి. అయితే సుకుమార్ ఈ గాసిప్పులను ఖండిస్తున్నప్పటికీ ‘పుష్ప 2’ అనుకున్న డేట్ కు రాదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హడావిడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ లీకులు నాని దృష్టి వరకు రావడంతో తన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ మూవీని ఆగష్టు 15న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో ఉన్నాడు అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి.దర్శకుడు వివేక్ ఆత్రేయ గతంలో నానీతో తీసిన ‘అంటే సుందరానికి’ మూవీ ఫెయిల్ అయినప్పటికీ ఈ దర్శకుడు చెప్పిన వెరైటీ కథ నచ్చడంతో ఆ కథ ‘సరిపోదా శనివారం’ గా మారిన విషయం అందరికీ తెలిసిందే..
మరింత సమాచారం తెలుసుకోండి: