రవితేజ హీరో గా అనుపమ పరమేశ్వరన్ కావ్య దాపరర్ హీరోయిన్ లుగా రూపొందిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

మూవీ కి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజం ఏరియాలో 4.38 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.82 కోట్లు ... ఉత్త రాంధ్రలో 1.58 కోట్లు , ఈస్ట్ లో 1.02 కోట్లు , వెస్ట్ లో 61 లక్షలు , గుంటూరు లో 1 కోటి ,  కృష్ణ లో 66 లక్షలు , నెల్లూరు లో 48 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ పూర్తి అయ్యే సరికి ఈగల్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11.55 కోట్ల షేర్ ... 20.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమాకి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.20 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 1.36 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 14.11 కోట్ల షేర్ ... 26 కోట్ల క్లాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 7.89 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబటినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటివరకు బ్రేక్ ఈవెన్ లో 64 శాతం కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: