యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా సమ్మర్ రిలీజ్ నుండి పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. సమ్మర్ రేసు నుండి తప్పుకుని దసరా బరిలో దిగుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్. దేవరతో తన దమ్ము చూయించాలనుకుంటున్న తారక్సినిమా విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. దసరా ఫైట్ లో విజయం సాధించేలా సినిమాను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట.

ఇదిలా ఉంటే దసరా రేసులో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 108వ సినిమా కూడా రైస్ లో ఉంటుందని టాక్. బాలయ్య బాబు కేసు బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు నందమూరి ఫ్యాన్స్. కానీ లేటెస్ట్ టాక్ ఏంటంటే సినిమాను కూడా దసరా రైస్ లో దించాలని చూస్తున్నారట మేకర్స్. బాలయ్య బాబుని నెవర్ బిఫోర్ యాక్షన్ హీరోగా చూపిస్తూ డైరెక్టర్ కె ఎస్ బాబి చాలా ఫోకస్ గా ఈ సినిమా తెరాకెక్కించారని తెలుస్తుంది.

బాలయ్య 108 సినిమా వర్సెస్ ఎన్టీఆర్ దేవర సినిమా పోటీ పడనున్నాయట. బాబాయ్ అబ్బాయి బాక్సాఫీస్ ఫైట్ అనేసరికి మిగతా ఫ్యాన్స్ లో కూడా ఆసక్తికరమైన బజ్ ఏర్పడింది. దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో వస్తుంది. బాలయ్య సినిమా మాత్రం తెలుగులోనే రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల మధ్య ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా ఆ సినిమాకు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడిందని తెలుస్తుంది. ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న దేవర మూవీ  రెండు భాగాలుగా భారీ బడ్జెట్ తో వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: