సినీ పరిశ్రమలో ఎక్కువ శాతం హీరోలకే రెమ్యూనరేషన్ భారీ గా ఉంటుంది. కానీ కొంత మంది హీరోయిన్ లు కూడా హీరోల స్థాయిలో రెమ్యూనిరేషన్ లను తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే మరి ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ లు ఏకంగా చిన్న స్థాయి ఇండస్ట్రీ లలో హీరోలు తీసుకునే దాని కంటే చాలా ఎక్కువ రేట్లు రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇండియా లోనే అత్యధిక రెమ్యూనరేషన్ ను తీసుకునే ముద్దు గుమ్మ ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈమె ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు 15 నుండి 30 కోట్ల రెమ్యూనరేషన్ వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈమె తీసుకుంటున్నంత స్థాయి రెమ్యూనరేషన్ ను ఇండియాలో మారే హీరోయిన్ కూడా తీసుకోవడం లేదు అనేది సమాచారం.

ఇకపోతే దీపిక కథను విన్న తర్వాత అందులో తన పాత్రను బట్టి ... తను ఆ మూవీ కి ఇస్తున్న డేట్ లను బట్టి రెమ్యూనరేషన్ ను 15 నుండి 30 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ... అలాగే ఈమెకు కూడా అద్భుతమైన క్రేజ్ ఉండడంతో నిర్మాతలు ఎంత రెమ్యూనిరేషన్ అయినా సరే ఈ ముద్దు గుమ్మకు ఇవ్వడానికి వెనకాడడం లేదు అని సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దీపిక ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: