టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చరణ్‌- శంకర్ కాంబినేషన్ లో ' గేమ్ ఛేంజర్' సినిమా చాన్నాళ్ల నుంచి షూటింగ్‌ జరుపుకుంటుంది.ఈ సినిమా గురించి కూడా పెద్దగా అప్డేట్స్‌ రావడం లేదు. అందువల్ల ఫ్యాన్స్‌ కూడా కొంతమేరకు నిరాశ చెందుతున్నారు.అయితే ఇలాంటి సమయంలో తాజాగా మూవీ గురించి కీలక సమాచారాన్ని చిత్ర నిర్మాత సంస్ధ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌ ఇచ్చారు.రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోబోతోందని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌కు కెమెరా మెన్‌ను ఫిక్స్‌ చేశారు మైత్రి మూవీ మేకర్స్‌. సౌత్‌ ఇండియా స్థాయిలో క్రేజీ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న రత్నవేలును ఎంపిక చేశారు.ఫిబ్రవరి 24న ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మైత్రీ నిర్మాణ సంస్థ ప్రకటించింది.


 రత్నవేలు ఇప్పటి దాకా రంగస్థలం,సైరా నరసింహా రెడ్డి,భారతీయుడు 2,ఖైదీ నం. 150, 1నేనొక్కడినే, బ్రహ్మోత్సవం, కుమారి 21F వంటి చిత్రాలతో పాటు దేవర ప్రాజెక్ట్‌లో ఆయన భాగమయ్యారు. ఇదే సినిమాలో కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ ఇంకా జాన్వీ కపూర్‌ నటిస్తున్నారని టాక్‌ ఉంది.ఇక రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్‌లో ఉండబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం బుచ్చిబాబు అండ్ టీం ఉత్తరాంధ్ర యాస బాగా మాట్లాడగలిగే నటీనటుల కోసం ఆడిషన్స్ జరిగాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా సాగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి రెండో వారంలో స్టార్ట్ కానుందని సమాచారం. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉండటం వల్ల ఆయన అభిమానులకు కానుకగా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేయాలని టీమ్‌ ప్లాన్‌ లో ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడం పక్కా అట.మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: