రెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం చివరన సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన సలార్ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని ప్రపంచ వ్యాప్తంగా నమోదు చేసుకుంది. ఈ సినిమాలో జగపతి బాబు , పృధ్వీరాజ్ సుకుమారన్ , శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటించారు.

ఇకపోతే సలార్ సినిమాతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న "కల్కి 2898 ఏడి" సినిమాలోనూ ... మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న "రాజా సాబ్" సినిమా లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నాడు. ఇకపోతే సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ప్రభాస్ అప్పుడప్పుడు లండన్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దానితో ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో లండన్ లో ఉంటున్న ప్రభాస్ అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రభాస్ లండన్ లో ఓ విలాసవంతమైన భవనాన్ని అద్దెకి తీసుకున్నట్లు ఇకపోతే ఈ భవనం అద్దె నెలకు ఏకంగా 60 లక్షలు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ప్రస్తుతం ప్రభాస్ లండన్ లో ఓ భారీ అద్దె కలిగిన ఇంటిలో అద్దెకు ఉంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి ... రాజా సాబ్ మూవీ లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: