అలా ఎంట్రీ ఇచ్చిన నయనతార తన భర్త విగ్నేష్ ని ఫాలో అవుతూ వచ్చింది. కానీ సడన్గా ఇప్పుడు అతనిని అన్ ఫాలో చేసింది.. కన్నీళ్లు ఊబికి వస్తున్నప్పుడు కూడా ఇదే నాకు మిగిలింది అని చెప్పడం మానదంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. అయితే జంటగా కనిపిస్తున్న ఫోటోలు మాత్రం ఇద్దరి సోషల్ మీడియాలో అలాగే ఉన్నాయి.. అయితే పొరపాటున అన్ ఫాలో అయ్యారంటూ పలువురు అభిమానులు సైతం తమ అభిప్రాయంగా వెల్లడిస్తున్నారు..
మరి కొంతమంది ఇద్దరు మధ్య ఏదైనా గొడవలు మొదలయ్యాయా ఎంతో ఆప్యాయంగా ఉండే వీరు అసలు ఏం జరిగింది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. అయితే ఇంతలోనే నయనతార బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.. ఈ వార్త వైరల్ కాకముందే instagram లో భర్తను మళ్ళీ ఫాలో అయింది. ఇది చూసిన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే నయనతార గత ఏడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టి భారీ విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత ఈమె నటించిన అన్నపూరణ సినిమా కూడా ఎన్నో వివాదాలకు దారితీసింది.. దీని తర్వాత తన తదుపరి చిత్రాలను కాస్త ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి