టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తాజాగా గామి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూ వీకి విద్యాధర్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని చాందిని చౌదరి ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమాను మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బృందం వారు మూడు నిమిషాలకు పైగా నిడివితో ఉన్న ఓ ట్రైలర్ ను విడుదల చేశారు.

మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉండడం తో దీనికి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ ట్రైలర్ పై రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రభాస్ తాజాగా గామి మూవీ ట్రైలర్ గురించి స్పందిస్తూ ... ఇంతకు ముందే గామి మూవీ ట్రైలర్ ను చూశాను. ఆ ట్రైలర్ చూశాక ఎగ్జిట్ అయ్యాను. ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. విశ్వక్ ఎప్పుడు కూడా చాలా కొత్తగా ప్రయత్నిస్తుంటాడు. ఈ సినిమాకి అన్ని డిపార్ట్మెంట్ లు చాలా చక్కగా పని చేశాయి.

అలాగే ఈ మూవీ మేకర్స్ కి ఆల్ ది బెస్ట్. ఈ మూవీ కి పని చేసిన వారందరి హార్డ్ వర్క్ ఈ సినిమా ట్రైలర్ లో కనబడుతుంది. ఇకపోతే ఈ మూవీ మార్చి 8 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాను చూసేందుకు చాలా వెయిట్ చేస్తున్న అని ప్రభాస్ ఓ వీడియోని విడుదల చేశాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్మూవీ ట్రైలర్ గురించి స్పందిస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: