స్టూడెంట్ నెంబర్ 1 మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి ఒక్కో మూవీ తో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ కొంత కాలం క్రితం విడుదల అయినటువంటి "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను తెచ్చుకున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే మరి కొన్ని రోజుల్లోనే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు తో "ఎస్ ఎస్ ఎం బి 29" అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఇప్పటికే వీరిద్దరి కాంబో లో ఓ మూవీ ఉంటుంది అని అందరికీ తెలిసినా కూడా అధికారికంగా ఈ మూవీ బృందం వారు ఎలాంటి పోస్టర్ ను కానీ ... వేరే ఇతర ప్రకటన కానీ చేయలేదు. దానితో వీరి కాంబో మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు మామూలు సినీ  ప్రేమికులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ అనౌన్స్మెంట్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

"ఎస్ ఎస్ ఎం బి 29" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యొక్క అధికారిక ప్రకటన ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా ఉండబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి "మహారాజా" అనే టైటిల్ ను ఈ మూవీ బృందం అనుకుంటున్నట్లు కూడా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించనుండగా ... కే ఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: