టాలీవుడ్ లో కత్రినా కైఫ్ అంటే తెలియని వారు ఉండరు. మల్లీశ్వరి సినిమా లో యువరాణి పాత్రలో ముద్దుగా మురిపించిన బ్యూటీ, తెలుగు లో 1, 2సినిమా లలోమత్రమే నటించింది. ఆతరువాత బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. యిప్పుడు తను ఒక శుభవార్త తో తన ఫ్యాన్స్ ముందుకు వచ్చింది..రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు గుజరాత్‌ రాష్ట్రం జామ్‌నగర్‌లో ఘనంగా ముగిశాయి.మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్‌ తారాగణం అంతా హాజరైంది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా, అభిషేక్ బచ్చన్, రన్బీర్ కపూర్, కాజోల్, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, కియారా అద్వానీ, మలైకా అరోరా వంటి పలువురు స్టార్స్ హాజరయ్యారు.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు బాలీవుడ్ కపుల్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకల్లో కత్రినా ఎప్పటికప్పుడు తన పొట్టభాగం కనపడకుండా.. దుపట్టాతో కవర్ చేశారు. ముంబైకి తిరిగి వెళ్లే క్రమంలో కూడా ఆమె తన ఉదరాన్ని దుపట్టాతో కప్పుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో కత్రినా గర్భంతో ఉందని, అందుకే బేబీ బంప్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి 2021 డిసెంబర్‌ నెలలో వివాహమైంది. కత్రినా, విక్కీల పెళ్లి జరిగి సుమారు రెండున్నరేళ్లు అవుతోంది. మరి కత్రినా తల్లి కాబోతున్నారనే వార్తలో ఎంతనిజం ఉందో తెలియాలంటే?.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇటీవలే బాలీవుడ్ నటి అనుష్క శర్మ మగ బిడ్డకు జన్మనిచ్చారు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా తాను తల్లికానున్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: