మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్యమూవీ లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

కియార అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ నుండి చాలా రోజుల క్రితమే "జరగండి జరగండి తప్పుకోండి" అంటూ సాగే ఓ సాంగ్ లీక్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఈ సాంగ్ లీక్ కావడంతో ఈ మూవీ బృందం పోయిన సంవత్సరం దీపావళి సందర్భంగా ఈ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సాంగ్ విడుదలను ఆపివేసింది.

ఇక ఆ తర్వాత ఈ సాంగ్ సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 27 వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా "జరగండి జరగండి తప్పకొండి" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరొక రెండు , మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: