అక్కినేని నాగ చైతన్య హీరో గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన "ఏం మాయ చేసావే" అనే సినిమాతో సమంత తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఇందులో ఈ బ్యూటీ తన నటన తో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమె కు వరుస గా టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించడంతో ఈమె చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈమె తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటి గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా సమంత ... అల్లు అర్జున్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సమంత తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాప్ హీరోలలో నాకు అల్లు అర్జున్ అంటే క్రష్ అని తెలియజేసింది. ఇకపోతే అల్లు అర్జున్ హీరో గా రూపొందున సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన "పుష్ప పార్ట్ 1" మూవీ లో సమంత ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ ద్వారా సమంత కు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: