టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలో నటిస్తూ బాగా బిజీ బిజీగా గడుపుతున్నారు.కాగా బాలయ్య బాబు చివర సారిగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొత్తానికి సూపర్ హిట్ గా నిలిచింది.. దాంతో ఇప్పుడు అదే ఊపుతో బాలయ్య బాబు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడపడంతో పాటు ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు.కాగా ఇటీవల శివరాత్రి సందర్భంగా ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ వీడియోలో నందమూరి బాలకృష్ణ డైలాగ్స్ అయితే చాలా బాగా ఆకట్టుకున్నాయి. బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ మార్క్ డ్రామాతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు.


ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు.ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. ఇప్పుడు కూడా ఈ సినిమా షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ  మూవీకి సంబందించిన విజువల్స్ ను కొన్ని చూసా అని ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న థమన్ అన్నారు. ఇందులో మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉండబోతుందని చెప్పుకొచ్చారు థమన్.ఈ సందర్భంగా థమన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఈ మూవీకి విజయ్ కార్తిక్ సినిమాటో గ్రాఫర్ గా పని చేస్తున్నారు.బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, షైన్ టామ్ చాకో లు కీలక పాత్రల్లో నటిస్తుండగా, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఈ మూవీలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఈ సినిమాకి ఈ హిట్ సెంటిమెంట్ ని నమ్ముకున్నాడు.ఈ మూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: