లేటెస్ట్ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు లో మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ ను ఏప్రిల్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు . ఇక పోతే తాజాగా ఈ మూవీ తెలుగు వర్షన్ "యూ ఎస్ ఏ" విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. 

మూవీ యొక్క "యూ ఎస్ ఏ" ప్రీమియర్ షో లను ఏప్రిల్ 5 వ తేదీనే ప్రదర్శించనున్నట్లు తాజాగా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు . ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ ని తెలుగు లో మైత్రి మూవీ సంస్థ వారు విడుదల చేయబోతున్నారు . అందులో భాగంగా ఇప్పటికే ఈ సంస్థ వారు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఈ మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులతో పాటు దాదాపు అన్ని పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీ లో ఏం మూవీ కలెక్ట్ చేయని కలెక్షన్ లను వసూలు చేసి మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా మలయాళ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగు లో విడుదల కానుండడంతో ఈ మూవీ పై టాలీవుడ్ సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

mb