మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు  సినిమాను మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి నిర్మించాడు. మూడు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 130 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.మంజుమ్మెల్ బాయ్స్ తర్వాత ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో సినిమాగా ప్రేమలు మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ బ్లాక్ బస్టర్ మూవీని తెలుగులో దర్శక దిగ్గజం ఎస్‌.ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ విడుదల చేశాడు. ఈ సినిమాతోనే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ ఫస్ట్ మూవీతోనే బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.ప్రేమలు తెలుగు వెర్షన్ థియేటర్లలో పదిహేను కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో రిలీజైన మలయాళం డబ్బింగ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ప్రేమలు మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడనే విషయం  ఎంతో ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ తెలుగు, మలయాళంతో పాటు మిగిలిన భాషల్లో మార్చి 29న (శుక్రవారం) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు బాగా ప్రచారం జరిగింది.. కానీ మూవీ మాత్రం ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో ఓటీటీ ప్రేక్షకులు కాస్త నిరుత్సాహానికి గురి అయ్యారు.ప్రేమలు ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అంటూ డిస్నీ హాట్‌స్టార్‌ను ట్యాగ్ చేస్తూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.అయితే ప్రేమలు మూవీ తమిళ వెర్షన్ మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. అలాగే తెలుగు వెర్షన్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ వెర్షన్స్ థియేటర్లలో ఆడుతుండటమే ఓటీటీ రిలీజ్ ఆలస్యానికి కారణం కావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో ఈ మూవీ రిలీజై నలభై రోజులు దాటిన థియేటర్లలో భారీగా ఈ మూవీ వసూళ్లను రాబడుతోంది.దీనితో నిర్మాతల రిక్వెస్ట్‌తో మార్చి 29న కాకుండా మరో రెండు వారాలు ఆలస్యంగా ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేయాలని డిస్నీ హాట్‌స్టార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: