టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ మూవీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్రేజీ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపు సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించబోతున్నారు.

మూవీ ని డిఫరెంట్ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తేజా తాజాగా హనుమాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకొని 200 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ తో తేజ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఇక తాజాగా కార్తీక్ ఘట్టమనేని ... మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఈగల్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కాకపోతే ఈ మూవీ లోని కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన విధానానికి మాత్రం కార్తీక్ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈ సినిమాకు కూడా టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మాత కావడం విశేషం. ఇక తేజ , కార్తీక్ కాంబోలో రూపోందబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రేపు సాయంత్రం విడుదల చేయడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఈ మూవీ బృందం రేపు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: