అయోధ్య రామ మందిరం తరువాత శ్రీరాముడి మ్యానియా దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈమ్యానియాతో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలు కూడ ప్రభావితం అవుతాయి అన్నసంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన సినిమాగా మారబోతున్న ‘రామాయణం’ మూవీ వార్తలతో బాలీవుడ్ మీడియా హోరెత్తి పోతోంది.



ఈసినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే మొదలైందని మెయిన్ ఆర్టిస్టులు లేకుండా ఈసినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ ముంబాయిలో ప్రారంభం అయింది అని అంటున్నారు. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈమూవీలో శ్రీరాముడుగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణాసురుడుగా యష్ నటిస్తూ ఉండటంతో ఈమూవీ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.



ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను వచ్చేవారం రాబోతున్న శ్రీరామనవమి రోజున విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈసినిమాలో రావణాసురుడి పాత్రకు ఎంపిక అయిన యష్ కు 75 కోట్ల పారితోషికం ఇస్తున్నారని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. అయితే ఈభారీ పారితోషికాన్ని యష్ తీసుకోకుండా ఈమూవీలో సహ నిర్మాతగా యష్ చెరినట్లు వార్తలు వస్తున్నాయి.



ఈసినిమాను మూడు పార్టులుగా తీస్తారని ‘సీతారామ కళ్యాణం’ తో పార్ట్ వన్ ముగుస్తుందని పార్ట్ 2లో శ్రీరాముడి వనవాసం రావణాసురుడి సీతా అపహరణ లాంటి కీలక సన్నివేశాలు ఉంటాయాని లీకులు వస్తున్నాయి. ఇక పార్ట్ 3లో రామ రావణ యుద్దం సీన్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటాయని లీకులు వస్తున్నాయి. ఈసినిమాలో రాముడుగా నటిస్తున్న రణదీర్ కపూర్ ఈమూవీ అయ్యేంత వరకు కేవలం సాత్విక ఆహారం తీసుకుంటూ తన లుక్ లో ఒక కొత్త ఒరవడి పరిచయం చేయాలని రణబీర్ కపూర్ ఒక స్తిర నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు సందడి చేస్తున్నాయి. అంతేకాదు ఈసినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేలోగా రణబీర్ సాయి పల్లవి లకు వాల్మీకి రామాయణం ఒక పండితుడుని పెట్టి వారికి అర్థం అయి ఒక పవిత్ర వారి ముఖంలో కనిపించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: