రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మరో నెల రోజుల్లోనే ఈ సినిమా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.దిల్ రాజు ఈ సినిమాని ఏకంగా 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ పొలిటికల్ కమర్షియల్ థ్రిల్లర్ జోనర్ లో ఉంటుందని సమాచారం తెలుస్తోంది.ఈ మూవీలో రామ్ రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇంకా అలాగే ఫ్లాష్ బ్యాక్ లో రాజకీయ పార్టీ నాయకుడి పాత్రలో కూడా హైలెట్ కానున్నాడు. తండ్రి, కొడుకులుగా రామ్ చరణ్ ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. కియారా అద్వానీ, అంజలి ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం వినిపిస్తోంది. అయితే అఫీషియల్ గా ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు.తమిళ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ తెలుగులో చేస్తోన్న మొట్టమొదటి సినిమా కావడంతో, ఈ మూవీ పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. శంకర్ సినిమాలు అంటే సోషల్ ఎలిమెంట్ ని కమర్షియల్ అంశాలు జోడించి ఉంటాయని అభిప్రాయం అందరిలో ఉంది.


సాధారణంగా అతని సినిమాలకి అన్ని భాషలలో కూడా మంచి ఆదరణ ఉంటుంది. అందువల్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి హిందీ నుంచి రిలీజ్ కోసం భారీ ఆఫర్స్ వచ్చాయి. ఫైనల్ గా స్టార్ డిస్టిబ్యూటర్ అనిల్ తడాని మూవీ హక్కులని ఏకంగా 75 కోట్లకి సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా వస్తోన్న సినిమా కావడంతో నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి.అందువల్ల 75 కోట్లు పెట్టి హిందీ థీయాట్రికల్ రైట్స్ ని అనిల్ తడాని కొనుగోలు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 తో పోల్చుకుంటే చాలా తక్కువ. పుష్ప 2 ఏకంగా 200 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా పుష్ప కంటే మూడింతలు వసూళ్లు రాబట్టి గ్లోబల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ పుష్ప 2 కి మాత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ కంటే మూడింతల బిజినెస్ జరిగింది.దీన్ని బట్టి పూర్తిగా అర్థం అవుతుంది పుష్ప 2 కి ప్రెసెంట్ బాలీవుడ్ లో ఒక రేంజ్ లో బజ్ ఉంది. చూడాలి రిలీజ్ అయ్యాక ఈ రెండు సినిమాలు ఏ విధంగా వసూళ్లు రాబడతాయో..

మరింత సమాచారం తెలుసుకోండి: