టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ ఆఖరుగా నటించిన 5 మూవీ ల క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు తెలుసుకుందాం.

విశ్వక్ తాజాగా విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన గామి అనే వైవిద్యమైన సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో చాందిని చౌదరి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 11.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

విశ్వక్ కొంత కాలం క్రితం దాస్ కా దమ్కి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇందులో ఈయన రెండు పాత్రలలో నటించాడు. నివేతా పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి విశ్వక్ స్వీయ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 11.76 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

విశ్వక్ కొంత కాలం క్రితం ఓరి దేవుడా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 5.72 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

విశ్వక్ హీరోగా రూపొందిన ఆకాశవానంలో అర్జున కళ్యాణం మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 4.83 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే కొంత కాలం క్రితం విశ్వక్ "పగల్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశ్వక్ కి తల్లి పాత్రలో భూమిక చావ్లా నటించింది. ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసిన సరికి ప్రపంచ వ్యాప్తంగా 5.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నివేత పెత్ రాజ్ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs