కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ పుష్ప, యానిమల్ సినిమాలతో ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగులో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఉంది.చలో సినిమా తో మొదలు పెట్టి ఇప్పుడు పుష్ప 2 దాకా దొరికిన అవకాశాలని సరిగ్గా వాడుకొని బాలీవుడ్ లో క్రేజ్ ని సొంతం చేసుకుంది. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన రష్మిక నటించింది. ఇక ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో కూడా మరిన్ని అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే యానిమల్ మూవీతో అక్కడ భారీ హిట్ అందుకుంది.ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న నటిగా మారుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి సినిమాల్లో నటించినా స్టార్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాని హీరోయిన్లు బాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అయితే రష్మిక మందన్నకు ఈ అవకాశం చాలా ఈజీగా దక్కింది. రష్మిక తన మొదటి సినిమా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించింది.


 ఆ తర్వాత ఏకంగా రణ్‌బీర్‌ కపూర్‌తో నటించి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ టాప్ సూపర్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్‌తో నటిస్తోంది.సల్మాన్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'సికందర్‌'లో హీరోయిన్ గా రష్మిక మందన్న ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీని ఇండియాలోని అగ్ర దర్శకుల్లో ఒకరైన ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేయనున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన సాజిద్ నదియావాలా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే సల్మాన్‌ఖాన్‌ మూవీల్లో హీరోయిన్‌లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు, కేవలం పాటలు, ఓ రెండు సన్నివేశాలకే పరిమితమవుతారు. కానీ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సికందర్‌' మూవీలో పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి రష్మికకు ఈ మూవీలో తన టాలెంట్ చూపించే మంచి అవకాశం దక్కిందని అంటున్నారు.అలాగే రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండతో ఓ చేస్తుంది. ఇంకా అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప 2', చేస్తుంది. వీటితోపాటు 'గర్ల్‌ఫ్రెండ్' సినిమాలో నటిస్తోంది. తమిళంలో కూడా కొత్త సినిమా ఒకే చేసింది. టైగర్ ష్రాఫ్‌, విక్కీ కౌశల్ తో కలిసి కూడా రష్మిక సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: