తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. చివరిగా rrr చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్లో వార్ -2 సినిమాలో కూడా నటిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో ఒక స్థలం వివాదంలో కోర్టు మెట్లు ఎక్కారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.వాటి గురించి ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. పూర్తిగా తెలుసుకుందాం.


ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని ఫ్లాట్ కొన్నారని ఆ వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టు మెట్లు ఎక్కారనే విధంగా వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ వార్తల పైన ఎన్టీఆర్ టీమ్ ఒక ప్రకటనను విడుదల చేసింది.. అదేమిటంటే ఈ ప్రాపర్టీ 2013 లోనే జూనియర్ ఎన్టీఆర్ కొన్నారని.. కానీ దీనికి సంబంధించిన వార్తలలో ఎన్టీఆర్ పేరు ఉపయోగించకుండా ఉండాల్సింది అంటూ  కూడా కోరుతున్నారు.


ముఖ్యంగా ఎన్టీఆర్ ఆ స్థలాన్ని కొనక ముందే సుంకు గీత బ్యాంకులో లోన్ పెట్టి మరి తీసుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంక్ ఆఫ్ బరోడా.. మరో రెండు బ్యాంకులు సర్ఫేసి యాక్ట్ కింద రికవరీ ట్రబ్యునల్  ఆశ్రయించారు ..ఈ స్థలానికి సంబంధించి ఎన్టీఆర్ నోటీసులు కూడా అందించారట.. అయితే ఈ ప్రాపర్టీని బ్యాంకు స్వాధీనం చేసుకునే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తన దగ్గర ఉండే డాక్యుమెంట్లు అన్నిటినీ కూడా ఈ చార్జెస్ షీటు దాఖలలో తెలియజేశారు ఎన్టీఆర్. ఈ కేసులో తనకు న్యాయం జరగాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: