గత కొంతకాలంగా నటి శోభిత ధూళిపాల అలాగే టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రేమలో ఉన్నారు అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత శోభితతో బాగా క్లోజ్ గా ఉంటున్నారు. అందుకు తగ్గట్టుగానే వీళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు.. బయట తిరుగుతున్న పలు ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండడం తో అందరూ షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ శోభిత నాగచైతన్య మాత్రం

 ఇప్పటివరకు ఎప్పుడు ఈ విషయంపై స్పందించలేదు. అలాగే దీనికి సంబంధించిన ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. సోషల్ మీడియాలో ఎన్ని రకాలు వార్తలు వస్తున్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ పనులతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు  నాగచైతన్యతో ప్రేమలో ఉన్నట్లు కన్ఫామ్ చేసింది.  తాజాగా కెన్స్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై దర్శనమిచ్చింది శోభిత. ఇందులో భాగంగానే తను చాలా స్టైలిష్ మోడ్రన్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. అంతేకాదు తన డ్రస్ కి తగ్గట్టుగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్

 కూడా పెట్టుకుంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే.. తను పెట్టుకున్న ఆ ఇయర్ రింగ్స్ లో  C అని లెటర్స్ కలిపిన మాదిరిగా ఉన్నాయి.  చైతన్య పేరు అందులో వచ్చేటట్లు గా జాగ్రత్త పడి ఇలాంటి ఇయర్ రింగ్స్ ను డిజైన్ చేయించుకుంది అని ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. వీళ్లిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు అందుకే ఆ లెటర్స్ ను ఇయర్ రింగ్స్ రూపంలో శోభిత పెట్టుకుంది అని మరి కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. మరి ఎంతో కాలంగా వీళ్లిద్దరి కి సంబంధించిన రూమర్స్ బయటకి వస్తున్నప్పటికీ వాళ్లు మాత్రం అటువంటిదేమీ లేదు అని ఆ వార్తలని ఎప్పటికప్పుడు కొట్టి పరేస్తున్నారు.  మరి ఇప్పటికైనా ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు వారి ఫ్యాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: