టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ రోజు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించాలి అనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమా యొక్క ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 28 లేదా 29 తేదీలలో నిర్వహించాలి అని దానికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిని చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలి అని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి నట సింహం బాలకృష్ణ ను ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా తీసుకురావాలి అని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు అందులో భాగంగా బాలకృష్ణ ను ఈ మధ్య సంప్రదించనున్నట్లు ఆయన కనుక ఓకే అన్నట్లు అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయనను ముఖ్య అతిథిగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... అంజలి ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs