ఇక తన తల్లిలాగే పోలికలతో ఉండడంతో ఈ ముద్దుగుమ్మకు బాగా కలిసొచ్చిందని కూడా చెప్పవచ్చు. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండడమే కాకుండా బాలీవుడ్ టాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తోంది. టాలీవుడ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో పాట రామ్ చరణ్ తో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి ఆమె కూతురు జాన్వీ కపూర్ కు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే జాన్వీ తన తల్లి శ్రీదేవి మరణం తర్వాత ఒక పని చేయనని మాట ఇచ్చిందట.
ఆ మాట ఏమిటంటే జాన్వీ కి స్మోకింగ్ చేసి అలవాటు చాలా ఎక్కువగా ఉండేదట. ఈ విషయం పైన తన తల్లి ఎన్నోసార్లు ఈ అలవాటు మానేయమని సలహా ఇచ్చినా కూడా మానలేదట. కానీ శ్రీదేవి మరణించిన తర్వాత మాత్రం ఆమె చివరి కోరికగా ఇది భావించిన జాన్వీ కపూర్ స్మోకింగ్ మానేసినట్లుగా ఒక న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. అంతేకాకుండా తన తల్లి మీద ఉండే ప్రేమని జాన్వీ కపూర్ ఎన్నోసార్లు తెలియజేసింది.. తన తల్లి కోరిక మీదకి జూనియర్ ఎన్టీఆర్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినట్లుగా కూడా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.